Tuesday, September 4, 2012



దమ్మున్న ఛానల్ కి దమ్మున్నfans కావాలి, మీకా దమ్ముంటే రండి ABNకు సపోర్ట్ చేద్దాం!

1 comment:

  1. ఆంధ్రజ్యోతి,tv9 ల ప్రసారాలు తెలంగాణా లో నిలిపివేసి ఇంత కాలమైనా(నేటికి 150 రోజులు)ఎవరూ నోరు మెదపడం లేదు.మన రాష్త్రంలో ఇంతమంది ప్రముఖులు,రాజకీయ నాయకులు,జర్నలిస్ట్ సంఘాలు ఉండి కూడా నోరు మెదపడం లేదు.ఇది మన చానల్ కాదు గదా మనకేంటి మన దాకా వస్తే అప్పుడు చూసుకుందాంలే అని ధీమాగా ఏ ఒక్కరు కూడా తగు రీతి లో స్పందించడం లేదు.
    ఒక కోతికి దెబ్బ తగిలితే వంద కోతులు వస్తాయి,అలాగే ఒక కాకికి కష్టం వస్తే వంద కాకులు వస్తాయి ,కానీ మన జర్నలిస్ట్ లు మాత్రం వాటికంటే హీనంగా మనకేంటి లే అని ఎవరి పని(వ్యాపారం)వారు చేసుకుంటున్నారు.
    ఎవరో ఒక రాజకీయ నాయకుడో,ఒక వ్యక్తో మహిళలను సాంప్రదాయ దుస్తులు ధరించి సంస్క్రుతి ని కాపాడమంటే,ఆ మాటలు వక్రీకరించి కొందరు స్వంత పాపులారిటీ కై రోడ్డెక్కితే వారిని ప్రసారం చేయడానికి ఉన్న ఓపిక,తీరిక తోటి మీడియా పై అరాచకం జరిగి కష్టాలలో ఉంటే కనికరం చూపే కాలం లేదు.
    మనలోనే ఒకరి గొంతు నులుముతుంటే,ఎవరూ కూడా గొంతు విప్పి అరవడం లేదు,అరవడం కాదు కరవాల్సిన సమయం ఆసన్నమైంది.మనమందరం కలిసి ఐక్యంగా పోరాడితే ఈ రోజున ఒకరిద్దరికి జరిగిన విధంగా భవిష్యత్ లో ఎవరికీ జరగకుండా ఉంటుంది.
    అసలు మీడియా అనేది లేకపోతే ఈ అరాచకాన్ని ప్రోత్సహిస్తున్న మన M.మంత్రి గారి పాపులారిటీ ప్రస్తుత స్తానం ఇప్పుడున్న హోదా ఎక్కడనుంచి,ఎలా వచ్చాయో ఆలోచించుకోవాలి.ఎలాగూ పదవి వచ్చింది గా అని ఆడిందే ఆటగా అడ్డు ఆపు లేకుండా పాలన సాగిస్తున్నారు.
    మీడియా అంటే మామూలు కాదనీ "మహాశక్తి" అని నిరోపించాల్సిన సమయం వచ్చింది.కొంతకాలం ఈ రకం నిరంకుష పాలనతో మీడియా గొంతు నొక్కేయవచ్చు కానీ దీనిని అంతం చేయలేరని తెలియజెప్పాలి. మీడియా అంతా ఏకమై ముక్తకంఠం తో గర్జిస్తే మన పాలకుల పదవుల పరిస్తితి ఏంటని ఒక్కసారి ఆలోచించుకోవాలి.
    ఏదో ఒక మాట జారిందని చిన్న కారణం చూపి మీడియా ను ఇంతకాలం నిషేదిస్తే,మరి ఒక భాధ్యాతాయుత పదవిలో ఉండి నరికేస్తా,పాతేస్తా,తొక్కేస్తా,బొందేస్తా అని అన్ని మాటలు జారిన మన M.మంత్రి గారిని ఎంతకాం నిషేదించాలో కూడా పాలకులే చేప్పాలి.
    ముఖ్యంగా ఈ సందర్బం లో మన పత్రికలు,చానల్స్ తీరు మాత్రం ఆందోళనకరం,మన లోనే కొంతమంది పై అరాచకం చేస్తుంటే,మిగతా కొందరు మాత్రం పాలకులకు పాపులారిటీ పెంచే పనిలో ఉన్నారు.ఇలాంటి సందర్బం లో ఎవరికి వారు స్వియ నియంత్రణ తో పాలకుల,రంగు పార్టీ కార్యక్రమాల ప్రసారాలు నిలిపివేస్తే యంత్రాంగం మొత్తం దానంతట అదే దిగివస్తుంది.
    చాలా మంది లో కసి గా ఉన్నా మన ఒక్కరం ఏం చేయలేమని వదిలేస్తున్నారు.తెలుగు లో ఒక సామెత లాగా"నా ఒక్కడి వల్లనే దేశం మారదు అనుకునే ఏ ఒక్కడి వల్ల దేశానికి కానీ చివరకు వాడికి కానీ ఏం ఉపయోగం లేదు"అన్నట్టుగా అందరూ పోరాడి మీడియాతో మ్యాజిక్ చేసే నాయకులకు గుణపాఠం చెప్పాలి.మీడియా ను ఎంతగా అణగదోస్తే బంతి లాగా అంతగా ఎదుగుతుందని తెలియజేయాలి.
    మీడియా సంస్తలను నమ్ముకొని కొన్ని వేల మంది జర్నలిస్ట్ లు,సాంకేతిక నిపుణులు జీవిస్తున్నారు.ఇప్పుడు వారు,వారి కుటుంబాల పరిస్తితి ఏంటని మన పాలకులను ప్రశ్నిస్తే,సమాధానం లేని ప్రశ్న గానే మిగిలిపోతుంది,ఇందరి జీవితాలతో ఆడుకుంటున్న మన పాలకులకు సరైన రీతిలో బుద్ది చెప్పాలి.
    జర్నలిస్ట్ బ్రతకలన్నా,వ్యవస్త ను బ్రతికించాలన్నా జర్నలిస్ట్ సంఘాలు,రాజకీయ ప్రముఖులు ఇలాంటి చర్యలకు,వేదింపులకు ఆనకట్ట వేసేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము.
    ఈ సందర్బం లో ABN,TV9ల తీరు,ప్రవర్తనా శైలి మాత్రం అందరికీ కనువిప్పు కావాలి.ఎంతలా అణచి వేసినా ఎదురీస్తూ,ఎదురొడ్దిన నిలిచిన తీరు అందరికీ ఆదర్శం.
    ABN
    అణగతొక్కినా భరించి నిలిచింది కానీ ఇంకా అణగతొక్కాలని ప్రయత్నిస్తే మాత్రం అణుబాంబు లా బద్దలై నిలువునా కాల్చేస్తుంది అని గుర్తుంచుకోవాలి
    TV9
    అంటే కూడా తరగని వెలుగని నిరూపించింది

    _ బలుసు సురేష్ (ఒక సాధారణ జర్నలిస్ట్,నేలకొండపల్లి మం,,ఖమ్మం జిల్లా)
    (వినియోగదారుల సంక్షేమ సంఘం, ఫోన్:9542398929)

    ReplyDelete